శ్రీశైలానికి స్థిరంగా వరద.. 884.80 అడుగులకు నీటిమట్టం - ఆంధ్రప్రదేశ్
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి లక్షా 96 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ఆనకట్ట రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 884.80 అడుగులకు నీటి మట్టం చేరింది. నీటి నిల్వ 214.84 టీఎంసీలుగా ఉంది.
sreesaialm project