కర్నూలు జిల్లాలో బుధవారం కొత్తగా 745 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మరో ఐదుగురు మృతిచెందగా.. మృతుల సంఖ్య 342కు చేరింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 40,845 మందికి కొవిడ్ సోకింది. వైరస్ నుంచి 33,661 మంది కోలుకోగా... 6,842 మంది ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు.
ఆగని కరోనా ఉద్ధృతి... కొత్తగా 745 మందికి పాజిటివ్ - kurnool district latest news
కర్నూలు జిల్లాలో కరోనా ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. బుధవారం కొత్తగా 745 కొవిడ్ కేసులు నమోదు కాగా... వైరస్ కారణంగా మరో అయిదుగురు మరణించారు.
కర్నూలు జిల్లాలో భారీగా నమోదవుతున్న కరోనా కేసులు