కర్నూలు మండలం పంచలింగాల అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులో సోమవారం సాయంత్రం భారీగా అక్రమ మద్యం తరలిస్తున్న కారును సెబ్ ఆధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న కారును సెబ్ సీఐ శ్రీనివాసులు సిబ్బంది ఆపి తనిఖీ చేయగా.. వేర్వేరు బ్రాండ్లకు చెందిన 648 మద్యం సీసాలు లభించాయి. కారుతో సహా మద్యం సీజ్ చేసి నిందితుడిని అరెస్టు చేశారు.
పంచలింగాల చెక్‌పోస్టు వద్ద భారీగా అక్రమ మద్యం పట్టివేత - కర్నూలు జిల్లా తాజా వార్తలు
కర్నూలు జిల్లా పంచలింగాల అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద భారీగా అక్రమ మద్యం పట్టుబడింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కారు, మద్యం సీసాలను సీజ్ చేశారు.
పంచాలింగాల చెక్‌పోస్టు వద్ద భారీగా అక్రమ మద్యం పట్టివేత
నిందితుడు అనంతపురం యాడికి ముండలం కమాలపాడుకు చెందిన సుధాకర్‌గా గుర్తించారు. అనంతపురంలో విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడితోపాటు కారు, మద్యం సీసాలను కర్నూలు అర్బన్ పోలీసు స్టేషన్ పోలీసులకు అప్పగించారు.
ఇదీ చదవండి:
POWER WAR: ఇరురాష్ట్రాల మధ్య విద్యుత్ పంచాయితీగా మారిన జల వివాదం
Last Updated : Jun 29, 2021, 6:09 PM IST