కర్నూలులో భారీగా మద్యం పట్టివేత...ముగ్గురు అరెస్టు - Heavy alcohol abuse in Kurnool three arested
రాష్ట్రంలో పలుచోట్ల మద్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు జరిపిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టుబడింది. కార్లలో తరలిస్తున్న 4 వేల 250 మద్యం ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు కార్లతో పాటు ముగ్గురిని అదుపులో తీసుకొని కేసు నమోదు చేశారు. ఎమ్మిగనూరు ఉప విభాగంలో ఎక్సైజ్ శాఖ దాడుల్లో భారీగా మద్యం దొరికింది. 11 వందల 52 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితుల్లో నలుగురు పరారయ్యారు. వారిపై కేసు నమోదు చేసినట్లు ఆబ్కారీ సీఐ మహేశ్ కుమార్ చెప్పారు.
కర్నూలులో భారీ మద్యం పట్టివేత, ముగ్గురి అరెస్టు
Last Updated : Mar 9, 2020, 7:02 AM IST