కరోనా నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. కర్నూలులో కరోనా కేసుల నమోదు, నియంత్రణ చర్యలపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... జిల్లాలో కరోనా ఆస్పత్రులను 9 నుంచి 11కు పెంచుతున్నామని వెల్లడించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో అధిక ధరలు వసూలు చేసినా... వైద్యం నిరాకరించినా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు సూచించారు. కరోనా విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరారు.
జిల్లాలో కొవిడ్ ఆస్పత్రుల సంఖ్య 11కు పెంపు: మంత్రి ఆళ్ల నాని
కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన కొవిడ్ ఆస్పత్రుల సంఖ్యను 9 నుంచి 11కు పెంచుతున్నట్లు మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. జిల్లాలో కరోనా నియంత్రణ చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
health minister alla nani