పోలీసుల దాష్టీకం వల్లే కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్‌సలాం, ఆయన కుటుంబీకులు ఆత్మహత్య(hcr commented AbdulSalam family suicide) చేసుకోవాల్సి వచ్చిందని జాతీయ మానవ హక్కుల కమిషన్(HRC) అభిప్రాయపడింది. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని పేర్కొంది. కేసులో వాస్తవాలు కలవరపరిచేలా ఉన్నాయని ఆందోళన వెలిబుచ్చింది. యూనిఫాం ధరించిన అధికారంలోని వ్యక్తుల కారణంగా నాలుగు విషాదకర మరణాలు చోటు చేసుకున్నాయని, పోలీసులకు ప్రత్యక్ష సంబంధం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికిచ్చిన షోకాజ్ నోటీసు(hrc notice on AbdulSalam family suicide)లో పేర్కొంది. పోలీసు సిబ్బంది కారణంగా.. కుటుంబం ప్రాణాలు కోల్పోయిన సంఘటన తీవ్రమైనదిగా పేర్కొంది. ప్రజాసేవకుల ద్వారా తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘన జరిగిందని, దీనికి సంబంధించి తగిన మధ్యంతర పరిహారాన్ని 6వారాల్లోగా పిటిషనర్‌కు చెల్లించాలని ఎందుకు ఆదేశించకూడదో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.
సీఐడీకి కేసును అప్పగించాలి