కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిన్న హోతూరులో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ నిప్పు అంటుకున్న ఘటనలో.. గడ్డివాము పూర్తిగా దగ్ధమైంది.
ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఏడు లక్షల వరకు నష్టం జరిగి ఉంటుందని బాధితులు వాపోయారు.