హత్తిబెళగల్ చెరువు పొంగింది... రోడ్డు కొట్టుకుపోయింది..! కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో కురిసిన వర్షాలకు హత్తిబెళగల్ పరిధిలోని చెరువు పొంగింది. నీటి ఉద్ధృతికి బళ్లారికి వెళ్లే రహదారి కొట్టుకుపోయి... పొలాలకు వెళ్లలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రహదారి మొత్తం కొట్టుకుపోవడం వల్ల రాకపోకలకు ఇబ్బందిగా మారిందని అన్నదాతలు చెబుతున్నారు. అధికారులు స్పందించి త్వరగా కల్వర్టును ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి :