ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పన్నులు చెల్లిస్తున్నా కల్యాణ మండపం కూలగొడతారా?' - తెదేపా నేత గౌరు వెంకటరెడ్డి తాజా వార్తలు

కర్నూలులోని వెంకట్ నాయుడు కల్యాణ మండపాన్ని కూల్చేందుకు అధికారులు వెళ్లడం వివాదాస్పదమైంది. అన్ని రకాల పన్నులు సకాలంలో చెల్లిస్తున్నా కూడా.. కూలగొట్టే చర్యలేమిటని తెదేపా నేతలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.

'పన్నులు చెల్లిస్తున్నా కల్యాణ మండపం కూలగొట్టేందుకు ఎలా వస్తారు'
'పన్నులు చెల్లిస్తున్నా కల్యాణ మండపం కూలగొట్టేందుకు ఎలా వస్తారు'

By

Published : May 8, 2021, 9:22 AM IST

కర్నూలులో తెలుగుదేశం నాయకులపై నగరపాలక సంస్థ అధికారులు కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆ పార్టీ నేత గౌరు వెంకటరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పాణ్యం నియెజకవర్గం కల్లూరు మండల పార్టీ అధ్యక్షుడు రామాంజనేయులుకు.. కర్నూలు నగరంలో వెంకట్ నాయుడు కల్యాణ మండపం ఉందని.. అధికారులు అనవసరంగా కూలగొట్టేందుకు వెళ్లారని ఆయన ఆగ్రహించారు.

పన్నులు చెల్లిస్తున్నా వేధింపులే..

కల్యాణ మండపానికి అన్ని విధాల పన్నులు చెల్లిస్తున్నా అధికారులు ముందస్తు నొటీసులు ఇవ్వకుండా కూలగొట్టేందుకు వెళ్లడంపై.. వెంకటరెడ్డి అధికారులను నిలదీశారు. కేవలం పంచాయితీ ఎన్నికల్లో తెదేపా నేతలు పోటీ చేసినందుకే వైకాపా శ్రేణులు, పసుపు పార్టీ నాయకులపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. నగరంలో ఎన్నో కల్యాణ మండపాలు అనుమతులు లేకుండా బాజప్తా నిర్వహిస్తున్నారని.. అన్ని పన్నులు సకాలంలో చెల్లిస్తున్నా కేవలం తెలుగుదేశం పార్టీ నేతలకు చెందిన వాటినే లక్ష్యంగా ఎంచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గట్టిగా నిలదీయడంతో అధికారులు సంఘటనా స్థలం నుంచి వెళ్లిపోయారు.

ఇవీ చూడండి:

రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నా.. ఊరూరా నిరీక్షణలే!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details