ఈ నెల 22వ తేదీన విజయవాడ-నంద్యాల ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న తేజస్వి అనే మహిళ పొగొట్టుకున్న బంగారు గొలుసును ఆర్టీసీ అధికారులు ఆమెకు అప్పజెప్పారు. కర్నూలు జిల్లా నంద్యాల ఆర్టీసీ డిపో బస్సులో మార్కాపురానికి చెందిన తేజస్వి ప్రయాణిస్తున్న సమయంలో మెడలో 13 గ్రాముల బంగారు గొలుసు జారి కిందపడిపోయింది. ఇంటికి వచ్చి గమనించిన ఆమె వెంటనే ఆర్టీసి ఎంక్వైరీకి ఫోన్ చేసి గొలుసు పోయిన విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. స్పందించిన అధికారులు సమాచారాన్ని నంద్యాల డిపో అధికారులకు చేరవేశారు. నంద్యాల డిపో మేనేజర్ సర్దార్ హుస్సేన్ తిరిగి ఆమె గొలుసును అప్పగించారు. ఆర్టీసీ అధికారులకు తేజస్వి కృతజ్ఞతలు తెలిపింది.
బస్సులో పోయిన బంగారు గొలుసు.. ప్రయాణికురాలికి అందించిన ఆర్టీసీ సిబ్బంది - Handing over the lost gold chain on the RTC bus in kurnool
ఆర్టీసీ బస్సులో పోగొట్టుకున్న బంగారు గొలుసును అధికారులు సదరు మహిళకు అప్పగించారు. ఈ నెల 22వ తేదీన విజయవాడ - నంద్యాల మార్గంలో ప్రయాణిస్తుండగా బంగారు గొలుసు జారి బస్సులో పడిపోయింది.
ఆర్టీసీ బస్సులో పోగొట్టుకున్న బంగారు గొలుసు అప్పగింత