కర్నూలు జిల్లా సంజామల మండలం పేరుసోములలోని రామిరెడ్డి అనే వ్యక్తి పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు గమనించి సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రాథమిక సహకార బ్యాంకులో ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్న ఆయనకు...చిన్న వయసులోనే పోలియో సోకింది. దీనివల్ల రెండు కాళ్లు నడవడానికి సహకరించలేదు. ఒంటరి జీవితాన్ని గడపలేక...ఇతరుల సాయం పొందలేక ఆవేదన చెందాడు. ఈ క్రమంలో మద్యానికి అలవాటు పడిన రామిరెడ్డికి... జీవితంపై విరక్తి చెంది మంగళవారం పెట్రోలు పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. సూసైడ్ నోట్ రాసుకున్నాడు. ఇందులో ఓ మహిళ తనకు డబ్బులు ఇవ్వాలని పేర్కొన్నాడు. ఈ ఘటనపై సంజామల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆత్మహత్య యత్నానికి పాల్పడిన దివ్యాంగుడు - కర్నూలులో ఆత్మహత్య యత్నానికి పాల్పడిన దివ్యాంగుడు
అంగవైకల్యం అతనిని కుంగతీసింది. అయినా ఇన్నేళ్లు కాలం ఎల్లదీశాడు. ప్రతిపనికి ఇతరుల సహాయం తప్పనిసరి అయ్యింది. వేరొకరికి భారమవుతున్నానని భావించాడో ఏమో... ఈ లోకాన్ని వీడి వెళ్లాలనుకున్నాడు. పెట్రోలు పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా పేరుసోములో జరిగింది.
![ఆత్మహత్య యత్నానికి పాల్పడిన దివ్యాంగుడు handicapped person tried to suicide in kurnool district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5555221-855-5555221-1577824019071.jpg)
ఆత్మహత్య యత్నానికి పాల్పడిన దివ్యాంగుడు