ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆదోని మార్కెట్​లోని హమాలీ కూలీల చర్చలు సఫలం

వారం రోజులుగా కొనసాగుతున్న హమాలీ కూలీల సమ్మె కొలిక్కి వచ్చింది. ఆదివారం సాయంత్రం ఆదోని వ్యవసాయ మార్కెట్​లో ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డి ఆధ్వర్యంలో చర్చలు జరిపారు.

hamali-workers-discussions-successful-at-adhoni-agriculture-market-at-kurnool
ఆదోని మార్కెట్​లోని హమాలీ కూలీల చర్చలు సఫలం

By

Published : Feb 10, 2020, 2:09 PM IST

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్​లో వారం రోజుల నుంచి బంద్ కొనసాగించారు. హమాలీల కూలీ ధరలు పెంచాలని... వారి సమస్యలు పరిష్కరించాలని హమలీ సంఘాలు సమ్మె చేశాయి. పత్తి వ్యాపారస్తులు చర్చలకు రాకపోవడంతో పత్తి విక్రయాలు ఆగిపోయాయి. వ్యవసాయ యార్డు బోసిపోయింది. ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఇరు వర్గాలు చర్చలు జరిపారు. హమలీ కూలి ధరలు 15శాతం పెంచుతూ ఒప్పందం చేశారు. ఈ మేరకు సమ్మెను విరమించారు. నేటి నుంచి యార్డులో పత్తి విక్రయాలు కొనసాగుతయాని ఎమ్మెల్యే అన్నారు.

ఆదోని మార్కెట్​లోని హమాలీ కూలీల చర్చలు సఫలం

ABOUT THE AUTHOR

...view details