ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యవసాయ మార్కెట్​ యార్డ్​ తెరవాలని సీఐటీయూ ధర్నా - కర్నూలు మార్కెట్​ యార్డ్​ వద్ద సీఐటీయా ధర్నా

కర్నూలు వ్యవసాయ మార్కెట్​ను ప్రారంభించాలని సీఐటీయూ కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్​ డిమాండ్​ చేశారు. కరోనా వైరస్​ నివారణ చర్యలు పాటిస్తూ మార్కెట్​ను తెరవాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్​ యార్డ్​ హమాలీలు, కార్మికులు పాల్గొన్నారు.

hamalais and workers protest at kurnool market yard undet citu to market reopen
సీఐటీయూ ఆధ్వర్యంలో హమాలీలు, కార్మికుల ధర్నా

By

Published : Aug 7, 2020, 3:41 PM IST

కర్నూలు వ్యవసాయ మార్కెట్​ను ప్రారంభించాలని హమాలీలు, కార్మికులు మార్కెట్​ ముందు ధర్నాకు దిగారు. సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కరోనా వైరస్​ నివారణ చర్యలు పాటిస్తూ వ్యవసాయ మార్కెట్​ను ప్రారంభించాలని సీఐటీయూ కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఏ. గఫూర్​ అన్నారు. రైతులకు ఉపయోగపడే మార్కెట్​ను​ బంద్​ చేసి మద్యం షాపులు తెరిస్తే ఏం లాభమంటూ ప్రశ్నించారు. అధికారులు స్పందించి మార్కెట్​ను తెరవాలని… లేని పక్షంలో హమాలీలకు నెలకు ఆర్థిక సహాయం అందించాలని గఫూర్​ డిమాండ్​ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details