కర్నూలు పంచలింగాల చెక్‌పోస్టు వద్ద భారీగా గుట్కా ప్యాకెట్లను సెబ్ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వస్తున్న కారును సెబ్ అధికారులు తనిఖీ చేయగా.. భారీగా గుట్కా ప్యాకెట్లు బయటపడ్డాయి. ప్యాకెట్లను తరలిస్తున్న తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లాకు చెందిన కట్రా శ్రీకాంత్, మహీత్ సుదాకర్లను అదుపులోకి తీసుకుని కారు, రూ.80 వేలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు సెబ్ సీఐ మంజుల తెలిపారు.
రూ. 2 లక్షలు విలువ చేసే కర్ణాటక మద్యం పట్టివేత..