ఇదీ సంగతి: ఊరి పేరే... ఆయన ఇంటి పేరు - local elections in ap news
గుమ్మనూరు జయరాం.... ప్రస్తుతం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో చిప్పగిరి మండలానికి చెందిన జయరాం...2001లో రాజకీయ రంగం ప్రవేశం చేశారు. మొదట ఎంపీటీసీ సభ్యుడిగా పోటీ చేసి పరాజితులయ్యారు. తర్వాత 2006లో తెదేపా తరుపున జడ్పీటీసీ పోటీ చేసి విజయం సాధించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చవి చూశారు. తర్వాత 2014లో వైకాపా తరుపున పోటీ చేసి గెలుపొందారు. తిరిగి 2019లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాదు ఏకంగా జగన్ కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఇలా గుమ్మనూరు జయరాం అంచలంచెలుగా ఎదిగి మంత్రి స్థాయికి ఎదిగారు. ఈయన స్వగ్రామం చిప్పగిరి మండలంలోని గుమ్మనూరు. ఊరి పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నారు మంత్రి జయరాం.
gumannuru jayaram become a minsiter from zptc level