ఈ నెల 5వ తేదీన శంషాబాద్లో అరెస్టైన పాకిస్థాన్ జాతీయుడు గుల్జార్ఖాన్ కేసు వివరాలపై... హైదరాబాద్కు చెందిన డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలోని సిట్ కర్నూలు జిల్లా గడివేములలో విచారణ చేపట్టింది. ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు గుల్జార్ఖాన్ భార్య దౌలత్బీని పోలీస్ స్టేషన్లో విచారించారు. అతనితో పరిచయం, పాస్పోర్ట్ తీసుకున్న విధానం, ఏజెంట్ పరిచయం, సంప్రదింపులు తదితర వివరాలను సేకరించారు. ఏజెంట్ నందికొట్కూరుకు చెందిన వ్యక్తిగా ఆమె సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. గుల్జార్ఖాన్ ఆధార్ కార్డు, ఓటర్ కార్డును జప్తు చేసిన అధికారులు కేసుపై పూర్తి స్థాయిలో విచారణ చేసి... న్యాయస్థానానికి నివేదిక అందిస్తామని డీఎస్పీ తెలిపారు.
పాకిస్థాన్ జాతీయుడు గుల్జారీ ఖాన్ కేసుపై సిట్ విచారణ - శంషాబాద్లో అరెస్టైన పాకిస్తాన్ జాతీయుడు గుల్జార్ఖాన్ వార్త
కర్నూలు జిల్లా గడివేములలో నివాసముంటున్న పాకిస్థాన్ జాతీయుడు గుల్జార్ ఖాన్ కేసుపై హైదరాబాద్ సిట్ పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుని ఆధార్ కార్డు, ఓటర్ కార్డును జప్తు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేసి న్యాయస్థానానికి నివేదిక అందిస్తామని ప్రత్యేక విచారణ బృంద అధికారులు తెలిపారు.
శంషాబాద్లో అరెస్టైన పాకిస్తాన్ జాతీయుడు గుల్జార్ఖాన్