ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గూడూరు తహసీల్దార్‌ ఆచూకీ ఎవరికెరుక..? - గూడూరు తహసీల్దార్ ముందస్తు బెయిల్​కోసం ధరఖాస్తు

అనిశా వలకు చిక్కినట్లే చిక్కి... తప్పించుకున్న గూడూరు తహసీల్దార్‌ హసీనాబీ ఆచూకీ ఇప్పటివరకూ లభించలేదు. ఇంతకీ ఆమె ఎక్కడ ఉన్నారు..? ఇన్ని రోజులుగా తప్పించుకొని ఏం చేస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది.

gudur thasildar applied anticipated bail
అనిశా అధికారులకు నేటికీ పట్టుబడని గూడూరు తహసీల్దార్‌

By

Published : Nov 27, 2019, 4:55 PM IST

Updated : Nov 27, 2019, 8:24 PM IST

కర్నూలు జిల్లా గూడురు తహసీల్దార్ లంచం తీసుకుంటూ... అనిశా అధికారులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకుంది. రోజులు గడుస్తున్నా తహసీల్దార్ ఎక్కడ ఉంది..? అనే విషయం ఇప్పటికీ ఎవ్వరికీ తెలీదు. తాజాగా ఆమె హైకోర్టులో ముందస్తు బెయిల్​ కోసం ధరఖాస్తు చేసుకున్నట్లు.... కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ ఉన్నతాధికారులు ఫోన్ చేసినా... ఆమె అందుబాటులోకి రాలేదు. ప్రభుత్వం ఇప్పటికే ఆమెను సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే.

ఆ ఉచిత సలహాలతో...
హసీనాబీకి సన్నిహితంగా ఉండే ఇద్దరు తహసీల్దార్లు... ‘నేరుగా లంచం తీసుకుంటూ దొరకలేదు కదా..? ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకోమంటూ సలహాలిచ్చినట్లు తెలుస్తోంది. వారినీ 2 రోజుల పాటు అనిశా అధికారులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే హసీనాబీ హైకోర్టులో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. కాగా... బెయిల్‌ మంజూరు చేయొద్దంటూ ఏసీబీ అధికారులు కోర్టును కోరారు. ఆమెకు వేరే మార్గం లేదని... ఏసీబీ డీఎస్పీ వద్ద గానీ... ఏసీబీ కోర్టులో లొంగిపోవాలని అధికారులు చెబుతున్నారు.

హసీనాబీ గురించి చెపుతున్నడీఎస్పీనాగభూషణం
Last Updated : Nov 27, 2019, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details