కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీ చైర్మన్గా జులపాల వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్గా పీఎన్. అస్లాం ప్రమాణ స్వీకారం చేశారు. కౌన్సిలర్లు అందరూ వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రత్యేక అధికారి మోహన్ దాస్ ఆధ్వర్యంలో ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమానికి తెదేపా, భాజపా, స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందిన కౌన్సిలర్లు పలువురు హాజరు కాలేదు. కోరం పది మంది కంటే ఎక్కువ ఉండటంతో ప్రక్రియను కొనసాగించారు.
గూడూరు నగర పంచాయతీ చైర్మన్గా జులపాల వెంకటేశ్వర్లు
కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీ చైర్మన్, వైస్ చైర్మన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెదేపా, భాజపా, స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గైర్హాజరయ్యారు.
గూడూరు నగర పంచాయతీ చైర్మన్గా జులపాల వెంకటేశ్వర్లు
గూడూరు నగర పంచాయతీలో వైకాపా రెండోసారి గెలుపొందటం సీఎం జగన్ విజయమని కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ పేర్కొన్నారు. నూతన పాలక వర్గానికి కోట్ల హర్షవర్ధన్ రెడ్డి అభినందనలు తెలిపారు.
ఇదీ చదవండి:డోన్ మున్సిపాలిటీ ఛైర్మన్గా సప్తశైల రాజేష్