ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మన్ను తింటున్న గోవులు.. ఎక్కడో తెలుసా..? - Nalla Malla Cows Eating Mud latest News

పచ్చి గడ్డి, పండ్లు, కూరగాయలు తినే ఆవులు ఆవురావురుమంటూ మట్టి తింటున్నాయి. ఇదేంటి పశువులు మట్టిని తింటున్నాయని ఆశ్చర్యపోతున్నారా.. నల్లమల్ల అటవీ ప్రాంతంలోని ఈ గోవులు మట్టిని తింటున్నాయి. ఈ ఆవులను చూడాలంటే కర్నూలు జిల్లా సంగమహేశ్వరం జానాలగూడెం అటవీ ప్రాంతాలకు వెళ్లాల్సిందే మరి.

ఆ మట్టిలో ఏముందో.. గోవులు తింటున్నాయి
ఆ మట్టిలో ఏముందో.. గోవులు తింటున్నాయి

By

Published : Oct 9, 2020, 6:40 PM IST

Updated : Oct 9, 2020, 7:34 PM IST

కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం, జానాలగూడెం నల్లమల అటవీప్రాంతంలో ఆవులు ఇష్టంగా మట్టిని తింటున్నాయి. ఆకలికి తట్టుకోలేకనో... లేక మరే ఇతర కారణాల వల్లో కానీ ఆవులు గుంపులుగా చేరి మట్టిని తింటున్నాయి.

  • గంటల తరబడి తింటూనే..

ఈ గోవులు గంటల తరబడి మట్టిని తింటుండడం గమనార్హం. ఈ విషయంపై కొత్తపల్లి పశు వైద్యాధికారిణి భువనేశ్వరిని వివరణ కోరగా జన్యుపరమైన లక్షణాల ప్రభావం కారణంగానే కొన్ని రకాల ఆవులు మట్టిని తింటాయని వెల్లడించారు. అటవీప్రాంత రైతులు మేత కోసం ఆవులను అడవుల్లోకి గుంపులుగా పంపించడం వల్ల... ఒక్క గోవు మట్టి తింటే మిగతా గోవులన్నీ అదే పద్ధతిని అనుకరిస్తాయని ఆమె తెలిపారు. పశువులు మట్టిని తినడం వల్ల ఇతరాత్ర రోగాల బారిన పడే ప్రమాదముందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే వాటిని సంబంధిత పశు వైద్యులకు చూపించాలని ఆమె సూచించారు.

ఆ మట్టిలో ఏముందో.. గోవులు తింటున్నాయి
Last Updated : Oct 9, 2020, 7:34 PM IST

ABOUT THE AUTHOR

...view details