ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్దతు ధర కోసం వేరుశెనగ రైతుల ఆందోళన - kurnool district latest news

ఆదోని వ్యవసాయ మార్కెట్​ యార్డులో వేరుశెనగ పంటకు మద్దతు ధర రాకుండా.. వ్యాపారులు ఇష్టం వచ్చినట్లు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు.

వేరుశెనగ అరబెట్టిన రైతులు
వేరుశెనగ అరబెట్టిన రైతులు

By

Published : Nov 3, 2020, 6:11 PM IST

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో.. వేరుశెనగ పంటకు మద్దతు ధర లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యాపారులు ఇష్టం వచ్చిన ధరకు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వింటాలు వేరుశెనగను రెండు వేల నుంచి నాలుగు వేల లోపే కొనుగోలు చేస్తున్నారని అన్నదాతలు వాపోయారు.

తేమ శాతం, నాణ్యత సరిగా లేదని వ్యాపారులు పంటను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు పంటను ఆరబెట్టి అమ్ముతున్నారు. అయినా తగిన మద్దతు ధర లేకపోవటంతో అప్పుల బాధ పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయిల్ ఫెడ్ ద్వారా మద్దతు ధరకు ప్రభుత్వమే తమ ఉత్పత్తులు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

ఇదీచదవండి

రైలు కింద పడి కుటుంబం ఆత్మహత్య.. నలుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details