..
'ఇళ్లు ఇవ్వకపోతే.. కట్టిన డబ్బులైనా తిరిగి ఇవ్వాలి'
పట్టణాల్లోని నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు మూడేళ్ల కిందట గత ప్రభుత్వం జీ ప్లస్ త్రీ నిర్మాణాలు చేపట్టింది. కర్నూలు శివారులోని జగన్నాథ గట్టుపై పదివేల గృహ సముదాయాలను జీ ప్లస్ త్రీ తరహాలో నిర్మించారు. 300, 365, 430 చదరపు అడుగుల్లో ఇళ్లను నిర్మించి...దాదాపు 90 శాతానికి పైగా పనులు పూర్తి చేశారు. వీటి కోసం లబ్ధిదారులు తమ వాటాగా రూ. 25 వేల నుంచి లక్ష రూపాయల దాకా చెల్లించారు. డబ్బులు చెల్లించి ముడు సంవత్సరాలు దాటినా గృహాలు కేటాయించలేదని లబ్ధిదారులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో తమ గోడును తెలిపారు. ఇళ్లు ఇవ్వకపోతే.. ప్రభుత్వానికి కట్టిన డబ్బులైనా తిరిగి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
కర్నూలులో జీ ప్లస్ త్రీ గృహాలు