ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కర్నూలులో.. సురక్షిత ప్రాంతాలకు 250 చెట్ల తరలింపు

By

Published : Jun 16, 2021, 7:49 AM IST

కర్నూలులో గ్రీన్ కో సోలార్ పార్క్ కోసం తొలగించిన చెట్లను.. గ్రీన్‌కో సంస్థ తిరిగి నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా 30 ఏళ్లు పైబడిన 250 చెట్లను సురక్షిత ప్రాంతానికి తరలించి నాటడం అభినందనీయమని జిల్లా అటవీ అధికారి అలెన్‌చాంగ్‌తరన్‌ ప్రశంసించారు.

Re-planting program
చెట్లు నాటే కార్యక్రమం

మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ సాధ్యమని కర్నూలు జిల్లా అటవీ అధికారి అలెన్‌చాంగ్‌తరన్‌ పేర్కొన్నారు. శకునాల సమీపంలో ఏర్పాటు చేసిన సోలార్‌ పార్కులో గ్రీన్‌కో సంస్థ ఆధ్వర్యంలో తొలగించిన చెట్లను మళ్లీ నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. పాణ్యం మండలం పిన్నాపురంలోని 900 ఎకరాల్లో గతంలో సోలార్‌ పార్కు ఏర్పాటుకు కొన్ని చెట్లను తొలగించాల్సి వచ్చింది.

ఈ క్రమంలో అక్కడి చెట్లను నరికివేయకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించి మళ్లీ నాటారు. జిల్లా అటవీశాఖ అధికారి అలెంగ్‌చాంగ్‌ తరన్‌ మాట్లాడుతూ 30 ఏళ్లు పైబడిన 250 చెట్లను సురక్షిత ప్రాంతానికి తరలించి నాటడం అభినందనీయమన్నారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా బయోసాయిల్‌ ఉపయోగిస్తున్నట్లు నిర్వాహకులు ఏఎస్‌ నాయుడు పేర్కొన్నారు.

ఇదీ చదవండీ..మండలి ఛైర్మన్‌గా మోసేను రాజు..?

ABOUT THE AUTHOR

...view details