కర్నూలు జిల్లా అహోబిలం బ్రహ్మోత్సవాల్లో భాగంగా... ఎగువ అహోబిలంలో శనివారం శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది. శ్రీ జ్వాలానరసింహ స్వామి, చెంచులక్ష్మి అమ్మవార్లు రథంపై ఊరేగారు. స్వామి నామస్మరణ చేస్తూ భక్తులు రథాన్ని లాగారు. దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లను మాడవీధుల్లో ఊరేగించారు. అహోబిలం మఠంలో ఉత్సవమూర్తులకు విశేష పూజలు చేశారు.
అహోబిలంలో ఘనంగా శ్రీలక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం - rathothsavam in kurnool district
కర్నూలు జిల్లా అహోబిలంలో స్వామి వారి రథోత్సవం ఘనంగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులు రథంపై మాడవీధుల్లో ఊరేగారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి.
అహోబిలం శ్రీలక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం