ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Tribute to Teacher : ఉపాధ్యాయుడికి ఘనంగా సన్మానం..పట్టణంలో ఊరేగిస్తూ కార్యక్రమం - 'kurnool-district latest

తల్లిదండ్రులు జన్మనిస్తే.. గురువు విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో మనకుంటూ ఓ గుర్తింపుతెచ్చుకోవడానికి నిచ్చెన వేస్తాడు. అలా తమకు తమకు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయుడిని.. పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు.

13882916
13882916

By

Published : Dec 12, 2021, 11:26 AM IST

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1980 నుంచి 1986 వరకు ఉపాధ్యాయుడిగా తాతారావు సేవలందించారు. ఆ సమయంలో ఆయన వద్ద చదువుకున్న విద్యార్థులు వివిధ రంగాల్లో స్థిరపడి ఉన్నతస్థాయికి ఎదిగారు. తమ గురువుని సన్మానించాలన్న ఉద్దేశంతో ప్రస్తుతం రాజమహేంద్రవరంలో ఉంటున్న తాతారావును విమానంలో హైదరాబాద్ కు, అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో గోనెగండ్లకు తీసుకొచ్చారు. పట్టణంలోని వీధుల్లో పెద్దఎత్తున ఊరేగింపు నిర్వహించి సన్మానించారు. తాము ఎదగడానికి స్ఫూర్తినిచ్చిన ఉపాధ్యాయుడిని సన్మానించడం ఎంతో సంతోషంగా ఉందని పూర్వ విద్యార్థుల ఆనందం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details