ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అహోబిలంలో కన్నులపండువగాా దీపావళి సంబరాలు - అహోబిలంలో కన్నులపండువగాా దీపావళి సంబురాలు

కర్నూలు జిల్లా అహోబిలంలోని శ్రీ లక్షీనరసింహస్వామి క్షేత్రంలో దీపావళి మహోత్సవాలను ఘనంగా జరిపించారు. వేడుకలకు పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులు ఉత్సవమూర్తులను తిలకించి భక్తి పరవశంలో ఓలలాడారు.

అహోబిలంలో కన్నులపండువగాా దీపావళి సంబురాలు
అహోబిలంలో కన్నులపండువగాా దీపావళి సంబురాలు

By

Published : Nov 14, 2020, 11:48 PM IST

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పరిధిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలసిన అహోబిల క్షేత్రంలో దీపావళి సంబరాలు ఘనంగా నిర్వహించారు. పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం నుంచే విశేష పూజలు జరిగాయి.

స్వామి వారికి అభ్యంగన స్నానం..

సూర్యోదయానికి పూర్వమే శ్రీ స్వామి వారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి తైల అభ్యంగనస్నానం చేయించారు. అనంతరం స్వాతి నక్షత్రం నేపథ్యంలో సుదర్శన హోమం సైతం చేపట్టారు.

అహోబిలంలో కన్నులపండువగాా దీపావళి సంబురాలు

గ్రామోత్సవం..

దీపావళి పవిత్ర దినోత్సవ సందర్భంగా క్షేత్రంలో స్వామి వారి ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం చేశారు. వేడుకలకు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు ఉత్సవమూర్తులను తిలకించి పరవశించిపోయారు.

ఇవీ చూడండి : రహదారులు అధ్వానం.. ప్రయాణంలో ఒళ్లు హూనం

ABOUT THE AUTHOR

...view details