శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున స్వామి వార్లకు తితిదే చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మంగళ వాయిద్యాల నడుమ పట్టు వస్త్రాలు సమర్పించారు. వీరికి శ్రీశైలం దేవాలయ ఈవో రామారావు సాదర స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సుబ్బారెడ్డి దంపతులు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌కు అర్చకులు వేదాశీర్వచనాలు పలికి, శేష వస్త్రాలు అందజేసి సత్కరించారు.
శ్రీశైల మల్లన్నకు తితిదే తరపున పట్టు వస్త్రాలు - తితిదే చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తాజా వార్తలు
శ్రీశైల మల్లన్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తితిదే చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వీరికి శ్రీశైలం దేవాలయ ఈవో రామారావు సాదర స్వాగతం పలికారు.
![శ్రీశైల మల్లన్నకు తితిదే తరపున పట్టు వస్త్రాలు Srisaila Mallanna Mahashivaratri Brahmotsavalu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6111582-828-6111582-1582012422396.jpg)
శ్రీశైల మల్లన్నకు పట్టు వస్త్రాలు సమర్పించిన తితిదే