రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ... రైతులకు వైకాపా అన్యాయం చేస్తోందని గౌరు చరితా రెడ్డి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. అధిక వర్షాలతో పంటలు దెబ్బతిని రైతులు ఇబ్బందులు పడుతుంటే వైకాపా ఎమ్మెల్యేలు ఒక్కరైనా పంటలను పరిశీలించారా? అని ప్రశ్నించారు. పంట నష్ట పరిహారం పంట వేయని వారికి ఇచ్చి అసలైన రైతులకు అన్యాయం చేశారని గౌరు చరితా ఆరోపించారు.
వైకాపా ప్రభుత్వం అన్ని విధాలా విఫలం: గౌరు చరితారెడ్డి - వైసీపీ నేతలపై గౌరు చరితారెడ్డి కామెంట్స్
వైకాపా ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందని పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి విమర్శించారు. ఇసుక విధానంతో ఎంతోమంది ఉపాధి కోల్పోయారని ఆరోపించారు.
![వైకాపా ప్రభుత్వం అన్ని విధాలా విఫలం: గౌరు చరితారెడ్డి వైకాపా ప్రభుత్వం అన్ని విధాలా విఫలం: గౌరు చరితా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9465538-914-9465538-1604743934584.jpg)
వైకాపా ప్రభుత్వం అన్ని విధాలా విఫలం: గౌరు చరితా