ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కర్నూలు విమానాశ్రయానికి.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు

By

Published : May 17, 2021, 6:44 AM IST

కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంగా పేరు మారుస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కర్నూలు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు ప్రతిపాదిస్తూ ఉత్తర్వులు
కర్నూలు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు ప్రతిపాదిస్తూ ఉత్తర్వులు

కర్నూలు జిల్లా ఓర్వకల్లు పరిధిలో ఉన్న విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంగా నామకరణం చేస్తూ ఏపీ ప్రభుత్వం అధికారిక ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ (ఎయిర్‌పోర్టు) శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆర్‌.కరికాల వలవెన్‌ ఆదివారం జీవో 21ని జారీ చేశారు.

కర్నూలుకు చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటీష్‌ వారిని ఎదురించి పోరాడిన ధీశాలి. ఈ ఏడాది మార్చిలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఓర్వకల్లులోని విమానాశ్రయాన్ని లాంఛనంగా ప్రారంభించిన రోజున ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెడుతున్నట్లు ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details