Amma vodi: ‘రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న అమ్మ ఒడి డబ్బులను జనం వృథాగా ఖర్చు చేస్తున్నారు. అవే డబ్బులతో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు కదా’ అని నిర్మల అనే మహిళ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డికి సూచించారు. కర్నూలు జిల్లా ఆదోనిలోని 16వ వార్డులో మంగళవారం ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా నిర్మల ఇంటి ముందుకు ఎమ్మెల్యే వెళ్లినప్పుడు ఆమె ఈ విషయంపై మాట్లాడారు.
Amma vodi: అమ్మఒడి డబ్బు వృథా చేస్తున్నారు.. ఎమ్మెల్యేకు మహిళ హితవు - govt is wasting money through ammavodi scheme says a woman in kurnool
Amma vodi: రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న అమ్మ ఒడి డబ్బులను జనం వృథాగా ఖర్చు చేస్తున్నారు. అవే డబ్బులతో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు కదా అని ఓ మహిళ అన్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో.. భాగంగా నిర్మల ఇంటి ముందుకు ఎమ్మెల్యే వెళ్లినప్పుడు.. ఎమ్మెల్యేతో ఈ విషయాన్ని ప్రస్తావించారు.
అమ్మఒడి డబ్బు వృథా చేస్తున్నారు.. ఎమ్మెల్యేకు మహిళ హితవు
తన భర్త ఆయుర్వేద వైద్యుడని, కరోనా సమయంలో మృతి చెంది రెండేళ్లు అవుతున్నా ఇంతవరకు వైఎస్‌ఆర్ బీమా నుంచి ఒక్క రూపాయీ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తామంతా కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ.2,200 డీడీలు చెల్లించామని, తమకు ఇళ్ల స్థలాలు చూపించాలని కమలమ్మ, నాగవేణి, మారెమ్మ, రంగమ్మ తదితరులు కోరారు. ఇళ్ల పట్టాలు ఇచ్చారు, స్థలాలు చూపి, ప్లాట్ల సంఖ్యలను చూపాలని షంషాద్, రబియా కోరారు.
ఇదీ చదవండి:అలా అడిగిన వారికి.. నా రెండో బిడ్డని చెబుతా
TAGGED:
amma vodi