Govt gives permision to ap judicial academy: ఆంధ్రప్రదేశ్ న్యాయశాఖను మరింత విస్తృత పరిచేందుకు చర్యలు తీసుకుంటుంది. దానికి సంకేతంగా న్యాయాధికారుల శిక్షణ నిమిత్తం ఏపీలో జ్యుడీషియల్ అకాడమీ ఏర్పాటుకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శాశ్వత ప్రాతిపదికన కర్నూలులో, తాత్కాలిక ప్రాతిపదికన మంగళగిరిలోని ఓ అద్దె భవనంలో న్యాయాధికారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రార్, ఇంచార్జి రిజిస్ట్రార్ జనరల్‌లను కోరింది. న్యాయ శాఖ కార్యదర్శి జి. సత్యప్రభాకర్‌రావు దీనికి సంబంధించి ఈనెల 19 న జీవో జారీచేశారు.
ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి జ్యుడీషియల్ అకాడమీ ఏర్పాటు కోసం హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ చేసిన సిఫారసుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రార్ ( ఐటీ - సీపీసీ ) ఇంచార్జి రిజిస్ట్రార్ జనరల్ 2019 ఆగస్టు 16 , 2020 అక్టోబర్ 1 న లేఖలు పంపారు. ప్రభుత్వం ఈనెల 19 న జీవో నం 152 జారీ చేస్తూ శాశ్వత ప్రాతిపదికన కర్నూలులో జ్యుడీషియల్ అకాడమీ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది.
ఇవీ చదవండి: