నంద్యాలలో గ్యాస్ లీకేజీ ఘటనపై ప్రభుత్వం చర్యలు - నంద్యాల ఎస్పీవై ఆగ్రో సంస్థలో ప్రమాదం వార్తలు
ఒకరి ప్రాణాన్ని బలిగొన్న నంద్యాలలో గ్యాస్ లీకేజీ ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దర్యాప్తు చేసేందుకు కలెక్టర్ ఓ కమిటీని నియమించారు.
nandyal gas leak
కర్నూలు జిల్లా నంద్యాల ఎస్పీవై ఆగ్రోస్ కంపెనీలో గ్యాస్ లీకేజీ ఘటనపై ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. జిల్లా పరిశ్రమల శాఖ జీఎం నేతృత్వంలో విచారణ కమిటీని కలెక్టర్ వీరపాండియన్ నియమించారు. కమిటీ సభ్యులుగా నంద్యాల ఆర్డీవో, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, లేబర్ అధికారి ఉంటారు. ఘటనపై విచారణ చేసి త్వరగా నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించినట్లు కలెక్టర్ వీరపాండియన్ వెల్లడించారు.