ఏపీ ఎన్జీవో సంఘం నాయకులు ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని మరచి రాజకీయ పార్టీల వైపు మొగ్గుచూపుతున్నారని కర్నూల్లో ఆరోపించారు. అశోక్బాబు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండి ఎమ్మెల్సీ పదవిని చేపట్టారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆయన ఎమ్మెల్సీని రద్దు చేయాలని కోరారు.
ఏపీ ఎన్జీవోపై ప్రభుత్వ ఉద్యోగుల ఆగ్రహం - government employees union outrage over ap ngo
ఏపీ ఎన్జీవో సంఘం నాయకులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూల్లో ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
ఏపీ ఎన్జీవోపై ప్రభుత్వ ఉద్యోగుల ఆగ్రహం
TAGGED:
ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన