ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'3 రాజధానులకు కట్టుబడి ఉన్నాం.. రాజకీయ లబ్ధికే రఘురామ లేఖలు' - శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ చీఫ్ విప్

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంటే.. కొందరు అడ్డుపడుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. నేడు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను ఆయన సతీమణితో కలిసి దర్శించుకున్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు.

Government Chief Whip Gandikota Srikanth Reddy
ప్రభుత్వ చీఫ్ విప్ గండికోట శ్రీకాంత్ రెడ్డి

By

Published : Jun 15, 2021, 1:40 PM IST

ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి.. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను సతీసమేతంగా దర్శించుకున్నారు. కొవిడ్ ముప్పు తొలగి రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు.

ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉందని.. సర్వతోముఖాభివృద్ధికి అడ్డుపడుతున్న ప్రతిపక్షాలు రాజకీయాలు మానుకోవాలని సూచించారు. రాజకీయ లబ్ధికే రఘురామకృష్ణరాజు లేఖలు రాస్తున్నారని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details