కర్నూలు జిల్లా మంత్రాలయంలోని ప్రధాన వీధిలో ఓ శునకం ఆవుదూడకు పాలివ్వడం చూపరులను ఆశ్చర్యానికి గురి చేసింది. గురువారం రాత్రి శునకం.. పడుకుని ఉన్న ఆవుదూడ దగ్గరగా వెళ్లింది. అప్పుడు ఆవుదూడ.. శునకం దగ్గర పాలు తాగడం ప్రారంభించింది. శునకం కదలకుండా అలాగే నిల్చుని.. తన పిల్లలకు పాలు పట్టించినంత ప్రశాంతంగా ఆవుదూడకి పాలిచ్చి అందరనీ ఆశ్చర్యపరిచింది.
మంత్రాలయంలో అద్భుతం..ఆవుకు అమ్మప్రేమను పంచిన శునకం - mantralayam news
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్లు రోజు ఎక్కడోచోట.. ఎదో ఒక వింత జరుగుతూనే ఉంది. కర్నూలు జిల్లా మంత్రాలయంలో అవుదూడకు శునకం పాలిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. కొన్ని రోజుల క్రితం ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఓ ఆవు పంది పిల్లకు పాలివ్వడం తెలిసిందే.
ఆవుదూడకు పాలిచ్చిన శునకం
అమ్మతనం ఎంతో గొప్పది. ప్రతి జీవి అమ్మ ప్రేమకు దాసోహామే. అమ్మకు తన.. మన అనే భేదము లేదు. మానవ రూపంలో ఉంటేనే అమ్మ కాదు. ఏ జీవి అయినా అమ్మతనానికి పూర్తి న్యాయం చేస్తుందని ఈ ఘటన నిరూపించింది.
ఇది చదవండి: