గౌరు దారి ఎటో? - గౌరు చరితారెడ్డి
కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం...వైకాపాలో చిచ్చుపెడుతోంది. రెండు బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు వైకాపా నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండటంతో...టికెట్ ఎవరిని వరిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో కాటసాని రాంభూపాల్ రెడ్డికి టికెట్ ఖరారైనట్లు, గౌరు దంపతులు వైకాపాకు గుడ్‌బై చెప్పనున్నట్లు ప్రచారం సాగుతోంది.
![గౌరు దారి ఎటో?](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2559942-512-a3163b49-7784-44a0-9451-5dc06d003042.jpg)
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. టికెట్‌పై వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి నుంచి స్పష్టత లేకపోవడంతో కర్నూలులోని ఆమె ఇంట్లో కార్యకర్తలతో చర్చిస్తున్నారు. నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు గౌరు దంపతులను కలుస్తున్నారు.
పాణ్యం టికెట్ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డికి దాదాపు ఖరారైనట్లు...గౌరు దంపతులు వైకాపాకు గుడ్‌బై చెప్పనున్నట్లు ప్రచారం జరుగుతోంది.. రెండురోజుల్లో గౌరు వెంకటరెడ్డి తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారని కార్యకర్తలు చెబుతున్నారు.