తమ సమస్యలు పరిష్కరించాలని కర్నూలులో గోపాల మిత్రలు ఆందోళన చేపట్టారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని నగరంలోని శ్రీకృష్ణదేవరాయల కూడలిలో మూడు రోజులుగా నిరసనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో గోపాల మిత్రలకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని కోరారు. మూడు రోజులుగా ఆందోళన చేస్తున్న తమను ఎవరూ పట్టించుకోవడం లేదని... ఇప్పటికైనా స్పందించకుంటే సోమవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు.
'సమస్య పరిష్కరించండి... ఉద్యోగ భద్రత కల్పించండి' - dharna
రాష్ట్రవ్యాప్తంగా గోపాలమిత్రల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కర్నూలులో మూడు రోజులుగా ఉద్యోగులు నిరసన చేస్తున్నారు.
గోపాలమిత్రుల నిరసన