కర్నూలు జిల్లా తుగ్గలి మండలం మల్యాల-లింగనేనిదిన్నె రైల్వే స్టేషన్ల మధ్య గూడ్సు రైలు పట్టాలు తప్పింది. ఆరో నంబరు బోగి మాత్రమే పట్టాలు తప్పటంతో భారీ ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ నుంచి తమిళనాడులోని సేలంకు బియ్యం లోడుతో రైలు వెళ్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రైల్వే సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు...తప్పిన ప్రమాదం - కర్నూలు జిల్లా తుగ్గులి ట్రైన్ వార్తలు
కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో బియ్యం లోడుతో వెళ్తున్న గూడ్సు రైలు పట్టాలు తప్పింది. సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. నిజామాబాద్ నుంచి సేలంకు రైలు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.
goods trains accidnet in kurnool dst thuggilli mandal malyala