Gold mines at Kurnool: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి, జొన్నగిరి ప్రాంతాల్లోని ఎర్ర నేలల్లో బంగారు నిక్షేపాల కోసం జియో మైసూర్ సంస్థ చాలా ఏళ్లుగా అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా సంస్థ ప్రతినిధులు చార్లెస్ డెవనిస్, సీఈవో హనుమ ప్రసాద్, హరికిరణ్ తదితరులు గురువారం మైనింగ్ ప్రాంతంలో పైలెట్ గోల్డ్ ఓర్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు పూజలు చేశారు.
Gold mining: కర్నూలు జిల్లాలో బంగారు నిక్షేపాలు.. తవ్వకాలకు అడుగులు - gold treasure
Gold Mining Process Unit Start: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి, జొన్నగిరి ప్రాంతాల్లోని ఎర్ర నేలల్లో బంగారు నిక్షేపాల కోసం తవ్వకాలకు అడుగులు పడ్డాయి. జియో మైసూర్ సంస్థ ప్రతినిధులు గురువారం మైనింగ్ ప్రాంతంలో పైలెట్ గోల్డ్ ఓర్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు పూజలు చేశారు.
![Gold mining: కర్నూలు జిల్లాలో బంగారు నిక్షేపాలు.. తవ్వకాలకు అడుగులు GOLd mining](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14055648-704-14055648-1640914339619.jpg)
GOLd mining
జియోమైసూర్ సంస్థ చాలా ఏళ్ల అన్వేషణ తర్వాత ఈ ప్రాంతంలోని 1500 ఎకరాల్లో బంగారు నిక్షేపాలున్నట్లు గుర్తించి తవ్వకాలు జరిపేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి పొందింది. భూమి పైపొరలో ఎంతమేర బంగారం ఉందో తెలుసుకునేందుకు తవ్వకాలు ప్రారంభించారు. అందుకనుగుణంగా ముడి ఖనిజం ప్రాసెసింగ్ యూనిట్‌ను కొత్తగా ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: