ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నంద్యాలలో చోరీ.. బంగారు ఆభరణాలు, సొత్తు మాయం - ఘటనపై దర్యాప్తు

కర్నూలు జిల్లా నంద్యాలలోని ఓ ఉపాధ్యాయుడి నివాసంలో చోరీ జరిగింది. దుండగులు బంగారు ఆభరణాలు, డబ్బు అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నంద్యాలలో చోరీ.. బంగారు ఆభరణాలు, సొత్తు మాయం
నంద్యాలలో చోరీ.. బంగారు ఆభరణాలు, సొత్తు మాయం

By

Published : Oct 28, 2020, 4:36 AM IST

కర్నూలు జిల్లా నంద్యాలలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. పట్టణంలోని నూనెపల్లె అశోక్​ నగర్​లో నివసిస్తున్న ఉపాధ్యాయుడు వెంకట్రామిరెడ్డి ఇంట్లో చొరబడిన దుండగులు బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. దసరా పండగకు వెంకట్రామిరెడ్డి కుంటుంబంతో సహా సొంతూరు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇంట్లో చోరీ జరిగింది.

దుండగలు ఇంటి తాళం పగల గొట్టి లోపలికి ప్రవేశించి... దోపిడీకి పాల్పడ్డారు. బీరువాలోని ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు, గాజులు, రూ.50 వేల నగదును అపహరించుకెళ్లారు. ఘటనపై దర్యాప్తు చేపట్టామని నంద్యాల మూడో పట్టణ ఠాణా సీఐ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

ఇవీ చూడండి : 'నాడు పండుగ కానుకలు.. నేడు పస్తులుండే పరిస్థితి'

ABOUT THE AUTHOR

...view details