కర్నూలు జిల్లా ఆదోనిలో పోలీసులు తనిఖీలు నిర్వయించారు. పట్టణంలోని షరఫ్ బజారులో చేపట్టిన తనిఖీల్లో బిల్లులు లేని.. 1 కిలో 200 గ్రాముల బంగారాన్ని స్వాధీనం(GOLD CAUGHT) చేసుకున్నారు. దీనికి సంబంధించి నరసరావుపేటకు చెందిన నగల వ్యాపారి రామకృష్ణ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి రసీదులు లేకుండా.. వారి వద్ద అక్రమంగా ఉన్న బంగారం విలువ రూ. 70 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. ఎలాంటి ఈ- వే బిల్లులు చూపనందున.. పట్టుబడిన బంగారాన్ని వాణిజ్య పన్నుల శాఖ అధికారికి అప్పగించనున్నట్లు ఒకటో పట్టణ సీఐ చంద్రశేఖర్ వెల్లడించారు.
ఇవీచదవండి: