Yuvagalam Padayatra: యువనాయకుడు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రను అడ్డుకునేందుకే ముఖ్యమంత్రి చీకటి జీవోలను తీసుకుని వస్తున్నారని టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్. రాజు కర్నూలులో అన్నారు. కర్నూలు జిల్లా తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎన్ని జీవోలు తెచ్చి అడ్డుకున్నా లోకేష్ పాదయాత్ర కొనసాగుతుందని ఆయన అన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని చంద్రబాబు నాయుడు సభలు, సమావేశాలను అడ్డుకోవాలని వైసీపీ నేతలు చూసినా.. ప్రజలు రెట్టింపు ఉత్సాహంతో వస్తున్నారన్నారు. ఎస్సీ నిధులు ఇతర పథకాలకు మళ్లించరాదని కోర్టు చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున స్పందించక పోవడం దారుణమని అన్నారు.
నారా లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకే చీకటి జీవోలు: ఎంఎస్ రాజు - చంద్రబాబు నాయుడు సభలు సమావేశాలను వైసీపీ నేతలు
Yuvagalam Padayatra: యువనాయకుడు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రను అడ్డుకునేందుకే ముఖ్యమంత్రి చీకటి జీవోలను తీసుకుని వస్తున్నారని తెలుగు దేశం పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్. రాజు కర్నూలులో అన్నారు.
Etv Bharat