ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాలిక అదృశ్యం.. మిస్సైందా.. కిడ్నాప్​ చేశారా..! - Kurnool District News

Girl Missing In Secunderabad: తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలిక అదృశ్యం కలకలం రేపింది. అయితే బాలిక ఓ వ్యక్తి వెంట నడుచుకుంటూ వెళ్తున్నట్లు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. ఈ నేపథ్యంలో బాలిక తనంతట తానే వెళ్లిందా.. లేదా అపహరణకు గురైందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బాలిక అదృశ్యం
Girl Missing

By

Published : Dec 23, 2022, 7:41 PM IST

Girl Missing In Secunderabad: తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలిక అదృశ్యం కలకలం రేపింది. బాలిక ఓ వ్యక్తి వెంట నడుచుకుంటూ వెళ్తుండటం, చాలాసేపటి వరకు ఆ వ్యక్తితోనే బాలిక ఉండటం స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. బాలిక తల్లి ఓ మెస్​లో పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అందులో పని చేస్తున్న వ్యక్తి వెంట బాలిక నడుచుకుంటూ వెళ్తుండటం అనుమానాస్పదంగా మారింది. బాలిక తనంతట తానే వెళ్లిందా.. లేక అపహరణకు గురైందా అనే కోణంలో పోలీసులు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. అదృశ్యం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు.

బాలిక అదృశ్యం.. మిస్సైందా.. కిడ్నాప్​ చేశారా..!

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details