ప్రియుడు మోసం చేశాడంటూ. ఓ యువతి అతని ఇంటిముందు ఆందోళన చేసింది. కర్నూలు జిల్లా నందవరానికి చెందిన డిగ్రీ విద్యార్థి రాకేష్‌కు హైదరాబాద్‌కు చెందిన అనూష ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యింది. మూడు నెలలు పరిచయం ప్రేమగా మారి హైదరాబాద్‌లోని ఓ దేవాలయంలో జూలై 4న ఇద్దరూపెళ్లి చేసుకున్నారు. నాలుగు రోజులు గడిచాక రాకేష్ నందవరానికి వెళ్లాడు. ప్రియుడు హైదరాబాద్ నుంచి తిరిగి రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన అనూష... నందవరంలోని రాకేష్ ఇంటి ముందు ధర్నాకు దిగింది. మహిళా సంఘాలు ఆమెకు మద్దతుగా నిలిచాయి. విషయం తెలుసుకున్న నందవరం పోలీసులు విచారణ చేపట్టారు.
మోసం చేశాడని ప్రియుడు ఇంటి ముందు యువతి ధర్నా - నందవరంలో యువతి ధర్నా వార్తలు
ఫేస్బుక్ ద్వారా మొదలైన ప్రేమ..పెళ్లికి దారితీసింది. ఇప్పుడు ఆ వివాహం కాస్తా మున్నాళ్ల ముచ్చటే అయ్యింది. ప్రియుడు మోసం చేశాడంటూ..ఓ యువతి అతని ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. ఈ ఘటన కర్నూలు జిల్లా నందవరంలో జరిగింది.

నందవరంలో యువతి ధర్నా