ఎన్నో ఏళ్లుగా రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని భర్తీ చేయాలంటే... గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు చేయాలని భాజపా నేత గంగుల ప్రతాపరెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలకు న్యాయం చేయాలంటే గ్రేటర్ రాయలసీమ ఏకైక మార్గమని అభిప్రాయపడ్డారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కలిపి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసేదాకా తాము విశ్రమించబోమని స్పష్టం చేశారు. గత రాజకీయ పరిస్థితులు, రాయలసీమ ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తామన్నారు. ఈ పోరాటంలో యువత భాగస్వామ్యం కావాలని కోరారు.
'గ్రేటర్ రాయలసీమ ఏర్పాటయ్యే వరకు విశ్రమించం' - గ్రేటర్ రాయలసీమ వార్తలు
భాజపా నేత గంగుల ప్రతాపరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీమ జిల్లాలను కలిపి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసేదాకా విశ్రమించేది లేదని చెప్పారు. భవిష్యత్తు తరాలకు న్యాయం జరగాలంటే గ్రేటర్ రాయలసీమ ఏకైక మార్గమని వ్యాఖ్యానించారు.
gangula pratap reddy