కర్నూలులో గణేశ్ నిమజ్జనోత్సవ సందడి నెలకొంది. వినాయక ప్రతిమలను కేసీ కాల్వ వినాయక ఘాట్ వద్ద నిమజ్జనం చేస్తున్నారు. క్రేన్ల సాయంతో ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. జనం పెద్దఎత్తున తరలిరాగా గణనాథుడు గంగమ్మ ఒడిలోకి చేరుతున్నాడు. ఏటా కర్నూలు నగరంలో 2 వేలకుపైగా విగ్రహాల ఏర్పాటు చేస్తారు. కరోనా ఆంక్షలు కారణంగా ఈసారి మాత్రం 700 విగ్రహాలే ఏర్పాటు చేశారు. తొమ్మిది రోజులు పూజలు అందుకున్న వినాయకుడికి చివరిరోజున ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కర్నూలులో కోలాహలంగా నిమజ్జనోత్సవం
కర్నూలులో గణేశ్ నిమజ్జనోత్సవం కోలాహలంగా సాగుతోంది. 9 రోజులు పూజలు అందుకున్న గణనాథుడికి ప్రత్యేక పూజల అనంతరం వీధివిధినా శోభాయాత్రలు నిర్వహిస్తున్నారు. యువకులు, మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా ఈ యాత్రల్లో పాల్గొంటున్నారు.ఇప్పటికే వినాయక ఘాట్‌కు పెద్దఎత్తున వినాయక ప్రతిమలు తరలిరాగా.. నిమజ్జనోత్సవ ప్రక్రియ రాత్రి 10 గంటల్లోగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు.
కర్నూలులో కోలాహలంగా నిమజ్జనోత్సవం
స్థానిక ప్రజాప్రతినిధులు పూజలు చేసి శోభయాత్రను ప్రారంభించారు. రాంబొట్ల ఆలయం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. వినాయక ఘాట్‌కు వినాయక ప్రతిమలు తరలివెళ్తుండగా.. యువతీయువకులు, భక్తులు సందడి చేస్తున్నారు. గణేశ్ నిమజ్జనం వేళ కర్నూలులో రాకపోకలపై ఆంక్షలు విధించారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: