కర్నూలులో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోంది. కరోనా నేపథ్యంలో భారీ విగ్రహాలు ఏర్పాటు చేయలేదు. కేసీ కాలువ వద్దనున్న వినాయక ఘాట్ వద్ద గణనాథుడికి ఎమ్మెల్యేలు కాటసాని రాంభుపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్, జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సంవత్సరం చిన్న విగ్రహాలు ఏర్పాటు చేసినందున చేతుల మీదుగానే నిమజ్జనం చేస్తున్నారు.
గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యేలు - kurnool dst taja news
కర్నూలు జిల్లా కేసీ కాలువ వద్ద గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్ ప్రారంభించారు. చిన్న చిన్న విగ్రహాలు కావటంతో చేతులతోనే నిమజ్జనం చేస్తున్నారు.
ganesh immersion programme started in kurnool dst
TAGGED:
kurnool dst taja news