కర్నూలులో వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం రాంబొట్ల దేవాలయంలో ఏర్పాటు చేసిన గణనాధుడికి స్థానిక ప్రజాప్రతినిధులు పూజలు చేసి శోభయాత్రను ప్రారంభించారు. శోభయాత్రలో యువకులు, మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నగరంలోని వినాయక ఘాట్ వద్దకు గణేష్ విగ్రహలు నిమజ్జనం కానున్నాయి. ఈ కార్యక్రమంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలో రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు.
GANESH IMMERSION: కర్నూలులో ప్రశాంతంగా కొనసాగుతున్న గణేశ్ శోభాయాత్ర - కర్నూలు గణేశ్ నిమజ్జనం
కర్నూలులో గణేశ్ శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం పూజల అనంతరం యాత్రను ప్రారంభించారు. శోభాయాత్రలో యువకులు, మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
కర్నూలులో ప్రశాంతంగా కొనసాగుతున్న గణేశ్ శోభాయాత్ర