ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వానొచ్చే... గాజులదిన్నెకు జలకళొచ్చే - గాజులదిన్నె జలాశయం నీటి వార్తలు

కర్నూలు జిల్లాలోని గాజులదిన్నె జలాశయం వాననీటితో కళకళలాడుతోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నీటి సామర్థ్యం పెరిగిందని... తమకు తాగునీటి ఇబ్బందులుండవని స్థానికులంటున్నారు.

Gajuladinne Water reservoir filled with rain water in kurnool district
కర్నూలులోని గాజులదిన్నె జలాశయాని చేరిన వర్షపు నీరు

By

Published : Jun 30, 2020, 3:25 PM IST

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు... కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని గాజులదిన్నె జలాశయం జలకళ సంతరించుకుంది. జలాశయం నీటి సామర్థ్యం నాలుగున్నర టీఎంసీలు కాగా... ప్రస్తుత వర్షాలకు రెండున్నర టీఎంసీలకుపైగా నీరు చేరింది. జలాశయం నీటిద్వారా వందలాది గ్రామాలకు తాగునీటి ఎద్దడి తీరుతుందని స్థానికులంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details