కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో బీఈడీ కళాశాల నడుపుతున్న శ్రీనివాసులు అతని మిత్ర బృందం అనాథల పాలిట శరణార్థుల్లా మారింది. అనాథలు ఎక్కడ కనిపించినా వారికి సపర్యలు చేస్తున్నారు. ఆస్పత్రులు, బస్టాండ్లల్లో దిక్కు లేని వారికి అన్నీ తామే అయి చూసుకుంటారు. ఒక వేళ అనాథలు చనిపోతే పోలీసులకు సమాచారమిచ్చి వారి అంత్యక్రియలను దగ్గరుండి జరిపిస్తున్నారు. మరణించిన వారి మతం తెలిస్తే ఆ సంప్రదాయం ప్రకారమే తంతు జరుపుతారు. ఇప్పటివరకూ 60 అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు జరిపినట్లు బృంద సభ్యులు తెలిపారు.
సేవా మంత్రమే స్ఫూర్తిగా.. అనాథలకు అండగా..! - Funeral services for orphans by a members in allagada
దిక్కు లేని వారికి దేవుడే దిక్కంటారు. కానీ ఇక్కడ మాత్రం దేవుడిలా అనాథలకు సపర్యలు చేస్తున్నారు ఓ మిత్ర బృందం. ఒక వేళ వారు చనిపోతే వారికి అంత్యక్రియలు చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన కొందరు సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఇవి..!

అనాథశవాలకు అంత్యక్రియలు జరుపుతున్న బృందం
Last Updated : Dec 26, 2019, 3:51 PM IST
TAGGED:
అనాథశవాలకు అంత్యక్రియలు