ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుడి మెట్లను తాకిన వర్షపు నీరు.. - ఈటీవీ భారత్​ తాజా వార్తలు

కర్నూలు జిల్లాలో కురిసిన భారీ వర్షానికి బేతంచెర్ల ఆర్​ఎస్​ రంగాపురంలోని శ్రీ లక్ష్మీ మద్దిలేటి స్వామి ఆలయం మెట్లను వరద నీరు తాకింది. అయితే, రేపు అమ్మవారి నూతన ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ జరగనుండగా, ఇలా వర్షపు నీరు గుడి మెట్లను తాకడం శుభశూచికమేనని ఆలయ అర్చకులు తెలిపారు.

full rain in maddileti swami temple at kurnool
కర్నూలులోని శ్రీమద్దిలేటి స్వామి వారి ఆలయంలో భారీ వర్షం

By

Published : Jun 12, 2020, 2:56 PM IST

కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామ సమీపంలోని శ్రీ లక్ష్మీ మద్దిలేటి స్వామి ఆలయ పరిసరాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి పెద్ద కోనేరు నుండి వర్షపు నీరు పొంగి పోర్లడంతో ఆలయం గుడి మెట్లను వరద నీరు తాకింది. పెద్ద కోనేరు, చిన్న కోనేరు, సుడిగుండం పూర్తిగా జలమయమయ్యాయి. ఇలా వర్షపు నీరు దేవాలయంలోని మెట్లను తాకడం, ఇది రెండో సారి అని ఆలయ అర్చకులు, సిబ్బంది తెలిపారు. అయితే... రేపు అమ్మ వారి నూతన ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ జరగనుండగా... ఇలా వర్షపు నీరు ఆలయ మెట్లను తాకడం శుభసూచికమేనని ఆలయ అర్చకులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details